కుమారస్వామి కోసం అభిమాని ప్రతిజ్ఞ... ఎట్టకేలకు కాశీ వెళ్లి తలనీలాలు ఇచ్చాడు!

  • తల వెంట్రుకలు తీయబోనని ప్రతిజ్ఞ
  • 2007లో ప్రమాణం చేసిన ఆర్కే గౌడ
  • ఇప్పుడు కాశీకి వెళ్లి మొక్కు తీర్చిన వైనం
జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ, తల వెంట్రుకలు, మీసం, గడ్డాలు తొలగించబోనని 11 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేసిన ఓ వ్యక్తి, ఇప్పుడు కాశీ వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాడు.  మైసూరు జిల్లా కేఆర్ నగర్‌ తాలూకా మేలూరు గ్రామానికి చెందిన రామక్రిష్ణ గౌడ, 2007లో కుమారస్వామి సీఎంగా తప్పుకున్న తరువాత, తిరిగి ఆయన సీఎం అయ్యేంత వరకూ శిరోముండనం చేయించుకోబోనని దీక్షబూనాడు. ఇటీవల ఎన్నికల అనంతరం కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు ఆయన సంబరాలు చేసుకున్నాడు. ఇక కుమారస్వామి కుమారుడు నిఖిల్, రామకృష్ణను ప్రత్యేకంగా బెంగళూరుకు పిలిపించి, అభినందించిన తరువాత, స్థానిక జేడీఎస్ నేతల కోరిక మేరకు కాశీకి వెళ్లి తలనీలాలు సమర్పించి తిరిగి వచ్చాడు.
Go Back to Shorts
JDS
Kumaraswamy
CM
Ramakrishna goud

More Telugu News